News
ఆంద్రా వారికే టిఆర్ఎస్ ప్రభుత్వం
తెలుగుదేశం వర్కింగ్ అద్యక్షుడు రేవంత్ రెడ్డి ఆంద్రా వారికే టిఆర్ఎస్ ప్రభుత్వం ఉపయోగపడుతోందని ఆయన ద్వజమెత్తుతున్నారు. తాజాగా తెలంగాణ తెలుగు యువత సమావేశంలో ప్రసంగిస్తూ తెలంగాణ ఐటి ,మున్సిపల్ శాఖల మంత్రి కె.తారక రామారావు చుట్టూరా ఆంద్రవారే ఉంటున్నారని రేవంత్ విమర్శించారు.గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలో సీమాంధ్రవారికి ఇరవై మందికి టిక్కెట్లు ఇచ్చారని అక్కడ తెలంగాణ పేదలు కనిపించలేదా అని ఆయన టిఆర్ఎస్ ను ప్రశ్నించారు.ఎందరో విద్యార్దులు, యువకుల ప్రాణత్యాగాలతో ఏర్పడిన తెలంగాణను కెసిఆర్ కుటుంబం పీల్చి పిప్పి చేస్తోందని ఆయన విమర్శించారు. తెలుగుదేశం పుట్టిందే హైదరాబాద్ ల అని, తెలంగాణకు ఇది పరాయి పార్టీ కాదని ఆయన చెప్పారు.కెసిఆర్ దత్తత తీసుకున్న ఎర్రవల్లి, నర్సక్కపేట గ్రామాలను చూపిస్తూ ఆ రెండు గ్రామాలకు సర్పంచులాగా పనిచేస్తున్నాడని రేవంత్ అన్నారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








